పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్న సమయంలో అణు ఒప్పందంపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగవని ఇరాన్ స్పష్టం చేసింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… “ఇరాన్ చర్చలకు ముందుకు రాకపోతే రెండు వారాల్లో దాడికి దిగుతాం” అంటూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ఈ తీర్మానం ప్రకటించింది.
ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఓ కీలక ప్రకటన చేశారు. “అణు ఒప్పందంపై చర్చలు జరపాలని అమెరికా నుంచి సూచన వచ్చింది. కానీ ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్న పరిస్థితుల్లో అలాంటి ప్రతిపాదనను మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాం” అని తెలిపారు.
ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల వెనుక అమెరికా ప్రోత్సాహం ఉన్నదనే అనుమానం తాము పెంచుకుంటున్నామని అరాఘ్చీ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ దాడులతో తమకు సంబంధం లేదని చెబుతున్నప్పటికీ, ఆ నమ్మకం ప్రపంచ దేశాల్లో పెరగడం లేదన్నారు. అమెరికా ఆమోదంతోనే ఇజ్రాయిల్ ఈ చర్యలు చేపడుతోందని అనేక దేశాలు విశ్వసిస్తున్నాయని స్పష్టం చేశారు.
ఇటువంటి ఘర్షణాత్మక పరిస్థితుల్లో శాంతి చర్చలు అసాధ్యమని ఇరాన్ అభిప్రాయపడుతోంది. ఇరాన్ వైఖ
read More : కుమారుడి వివాహ వాయిదాపై నెతన్యాహు వ్యాఖ్యలు

One thought on “ఇజ్రాయిల్ దాడులపై తీవ్ర అసంతృప్తి”
Comments are closed.