INS Tarkash భారీ ఆపరేషన్: సముద్రంలో 2500 కేజీల మాదకద్రవ్యాలు స్వాధీనం!

భారత నౌకాదళం మరో కీలక విజయాన్ని సాధించింది. అక్రమ మాదకద్రవ్య రవాణాను అరికట్టేందుకు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్‌లో INS Tarkash యుద్ధనౌక 2500 కేజీల మాదకద్రవ్యాలను సముద్రంలో స్వాధీనం చేసుకుంది.

ఈ సాహసోపేతమైన ఆపరేషన్ భారత నౌకాదళం అక్రమ రవాణాపై తీవ్ర పోరాటానికి నిదర్శనం అని నావికాదళ అధికారులు తెలిపారు. “మన సముద్రాలు దేశ గర్వం, నేరాలకు గేటువే కాదు!” అంటూ నేవీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

భవిష్యత్ తరాలను మాదకద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు భారత నౌకాదళం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. “ప్రతి గ్రాము మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఒక భవిష్యత్తును కాపాడినట్లే!” అని నేవీ తెలిపింది.

ఈ ఆపరేషన్ నౌకాదళ నిఘా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. సముద్ర మార్గంలో జరుగుతున్న అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Read More : థాయిలాండ్‌ పర్యటనకు ప్రధాని మోదీ