1950లో భారత్‌కు ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనే ఆహ్వానం వచ్చినా, ఆ అవకాశాన్ని మనమే వదులుకున్నామని మీకు తెలుసా? బ్రెజిల్‌లో జరిగిన ఆ టోర్నమెంట్‌కు వెళ్లేందుకు అవసరమైన ఖర్చును భరించే స్థోమత అప్పట్లో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF)కు లేకపోవడంతో ఆ ఆహ్వానాన్ని తిరస్కరించింది. అంతేకాదు, అప్పుడు ఒలింపిక్స్‌ను ఫిఫా వరల్డ్‌కప్ కంటే ఎక్కువ ప్రతిష్టాత్మకంగా భావించినందున కూడా పాల్గొనకూడదని నిర్ణయించింది.
ఇక తాజాగా స్పెయిన్ లెజెండ్ జావి హెర్నాండెజ్ భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్‌గా పనిచేయడానికి దరఖాస్తు చేసుకున్నా, అధిక పారితోషిక వ్యయం కారణంగా AIFF తిరస్కరించింది. ఈ సంఘటన 1950లో జరిగిన అదే నిర్ణయాన్ని గుర్తు చేస్తోందని క్రీడాభిమానులు చెబుతున్నారు.
Read More : భారత ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా జావీ దరఖాస్తు.. ?

One thought on “భారత ఫుట్‌బాల్‌లో పాత తప్పులు మళ్లీ జరుగుతున్నాయా?”
Comments are closed.