IND vs AUS: బ్రిస్బేన్‌లో టెస్టు.. యువ ఆటగాడిపై టీమిండియా నిర్ణయం!
ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో హర్షిత్ రానా
భారత జట్టు యువ ఆటగాడు హర్షిత్ రానా, తొలి టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నా, రెండో టెస్టులో మాత్రం ఫలితం నిరాశను మిగిల్చింది. అభిమానుల ఆగ్రహానికి గురైన రానాను మూడో టెస్టు ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించాలని టీమిండియా యోచిస్తున్నట్లు సమాచారం. తొలి టెస్టులో మెరిసిన రానా, ఆడిలైడ్ టెస్టులో ఆసీస్ బ్యాటర్ల దాడిని తట్టుకోలేకపోయాడు.
రాణా స్థానంలో ప్రసీద్ కృష్ణ?
రెండో టెస్టులో మార్నస్ లబూచేన్, ట్రావిస్ హెడ్‌లకు ఎదురులేక తడబడ్డ రానా, టీమిండియా కోరికలకు తగ్గట్లు ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఈ నేపథ్యంలో కర్నాటక పేసర్ ప్రసీద్ కృష్ణను రానా స్థానంలో తీసుకురావాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా రానా స్థానంలో ప్రసీద్‌ను తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
రోహిత్ శర్మ మద్దతు
రానాపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అతడికి మద్దతుగా నిలిచాడు. “రెండు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను పక్కన పెట్టడం సరైనది కాదు. రాణా అనుభవలేమిని ఆసీస్ జట్టు సద్వినియోగం చేసుకుంది” అని రోహిత్ పేర్కొన్నాడు.
జట్టు సౌకర్యమే ముఖ్యమా?
రానాను జట్టు నుంచి తొలగించడం అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చని కొందరు అంటున్నారు. అయితే, జట్టు ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
డిసెంబర్ 10న బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో రానా ఆడతాడా లేదా అన్న సందిగ్ధతకు సెలక్టర్లు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
