హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద కారులో మంటలు

హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన పిలర్ నంబర్ 110 సమీపంలో చోటు చేసుకుంది.

కారులో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై బయటకు దిగారు. తద్వారా వారు తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు. ప్రమాద సమయంలో కారులో నాలుగు మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు వైపులా వాహనాలు బారులుగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే కారుకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తోంది.ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

Read More : బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్‌కు నైతిక హక్కు లేదు – హరీష్‌రావు

One thought on “హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద కారులో మంటలు

Comments are closed.