High Protein Intake: ప్రొటీన్ అధికంగా తీసుకుంటే ఏవైనా సమస్యలు ఉంటాయా?

High Protein

అతి అన్నింటా అనర్థదాయకమే. ఇటీవల ఫిట్‌నెస్, డైట్ పేరుతో కొందరు అధిక ప్రొటీన్‌ను తీసుకునే దిశగా వెళ్లిపోతున్నారు. అయితే ఇది శరీరంపై ప్రతికూల ప్రభావాలను కలిగించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అధిక ప్రొటీన్ వల్ల కలిగే సమస్యలు

1. దాహం పెరుగుతుంది
శరీరంలో ప్రొటీన్ అధికమైతే నీరసత, తీవ్రమైన దాహం ఏర్పడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రొటీన్లో ఉండే నత్రజని రక్తంలో అధికంగా చేరినప్పుడు మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి, శరీరానికి అధికంగా నీరు అవసరమవుతుంది. ఫలితంగా ఎంత నీరు తాగినా దాహం తీరకపోవడం, శరీర బలహీనత, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.

2. నోటి దుర్వాసన
ప్రొటీన్ అధికంగా తీసుకునే వారిలో నోటి దుర్వాసన ఏర్పడటాన్ని వైద్యులు గమనిస్తున్నారు. ప్రొటీన్లోని రెండు ముఖ్యమైన ఆమ్లాల వల్ల ఈ దుర్వాసన ఉత్పన్నమవుతుంది. దీనికి పరిష్కారంగా అధికంగా నీరు తాగాలని సూచిస్తున్నారు.

3. మలబద్ధకం
కార్బోహైడ్రేట్లు తగ్గి, ప్రొటీన్ అధికంగా తీసుకుంటే మలబద్ధకం సమస్య ఉత్పన్నమవుతుంది. దీనివల్ల జీర్ణక్రియలో అంతరాయం ఏర్పడి శరీరంలో అసౌకర్యం ఏర్పడవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

4. ఒంటి నొప్పులు
ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలు శరీరంలో వేడిని పెంచే లక్షణం కలిగి ఉంటాయి. ముఖ్యంగా చికెన్, గుడ్లు, రొయ్యలు వంటి ఆహారాలు మితిమీరినప్పుడు ఒంటి నొప్పులు, నడుమునొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు తెలిపారు.

ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలు
మటన్, చికెన్, గుడ్లు, చేపలు, రొయ్యలు, పాలు, పెరుగు, చీజ్, బాదం, జీడిపప్పు, వాల్నట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సన్ ఫ్లవర్ గింజలు, టోఫు, శెనగలు వంటి ఆహారాల్లో అధికంగా ప్రొటీన్ ఉంటుంది.

మోతాదును అనుసరించండి
ఒక వ్యక్తి శరీర బరువుకు అనుగుణంగా ప్రొటీన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా ప్రతి కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రొటీన్ సరిపోతుందని నిపుణులు వివరిస్తున్నారు. అధిక ప్రొటీన్ తీసుకునే ముందు వైద్యుల సూచనలు పాటించాలని సూచిస్తున్నారు.

Read More

One thought on “High Protein Intake: ప్రొటీన్ అధికంగా తీసుకుంటే ఏవైనా సమస్యలు ఉంటాయా?

Comments are closed.