హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో మరోసారి విద్యార్థుల ఆందోళన గందరగోళం దారితీసింది. క్యాంపస్‌లోకి పోలీసులను అనుమతించడంలో రిజిస్ట్రార్ పాత్ర ఉందంటూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జ్‌కు ఆయనే కారణమని ఆరోపించారు.
క్యాంపస్ లోపల జరిగిన పోలీస్ చర్యలపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు, రిజిస్ట్రార్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను వెంటనే ఉపసంహరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. యూనివర్సిటీలోని విద్యార్థుల భద్రత, హక్కులు రక్షించాల్సిన సమయంలో అధికారుల తీరుపై విద్యార్థుల్లో ఆగ్రహం మరింతగా వ్యక్తమవుతోంది.
Read More : కేటీఆర్ బాంబ్: భారీ ల్యాండ్ స్కామ్స్ సంచలనం.. బీజేపీ ఎంపీపై ఆరోపణలు!
