బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమే: హరీష్‌రావు

బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమని, పార్టీ పనితీరు ప్రజల సంక్షేమానికి ధారాళమైనదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు శుక్రవారం తెలిపారు. ఆయన సిద్దిపేట పట్టణంలోని రంగాధంపల్లి అమరవీరుల స్థూపం వద్ద “చలో వరంగల్” సభకు వెళ్ళే విద్యార్థులు మరియు యువత పాదయాత్రను ప్రారంభించారు.

హరీష్‌రావు పాదయాత్ర ప్రారంభించే ముందు, పహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన వారి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం, వెయ్యి మందికి పైగా విద్యార్థులు, యువతతో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. “జోహార్ తెలంగాణ అమరవీరులకు” అని నినాదాలు చేస్తూ పాదయాత్ర కొనసాగింది.

ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, “ఈ రోజు సిద్దిపేట నుండి పాదయాత్రలో పాల్గొనేవారికి, విద్యార్థి, యువకులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.

Read More : వాతావరణ శాఖ హెచ్చరిక..