గుంటూరులో మత్తుమందు ముఠా అరెస్ట్

గుంటూరులో Drugs Gang పై పోలీసులు దాడి నిర్వహించి, MDMA మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు, సాయి కృష్ణనగర్‌లోని ఓ Apartment లో మత్తుమందు సేవిస్తున్నారని అనుమానించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఈ దర్యాప్తులో Engineering Students సహా మొత్తం తొమ్మిది మంది అరెస్టయ్యారు. వారి వద్ద నుంచి 10.67 Grams MDMA మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో Bengaluru నుండి గుంటూరుకు మత్తుమందు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌లో ప్రధాన ముద్దాయిగా ఇంజినీరింగ్ విద్యార్థి Sai Krishna ఉన్నట్లు వెల్లడైంది.

పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. Drug Trafficking పై మరింత లోతుగా విచారణ కొనసాగుతోంది.

Read More…