గూగుల్ : అసత్య ప్రచారాలపై 11 వేల యూట్యూబ్ ఛానళ్ల తొలగింపు

యూట్యూబ్‌లో అసత్య ప్రచారాలు చేస్తోందన్న ఆరోపణలపై గూగుల్ భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. వివిధ దేశాలకు చెందిన సుమారు 11,000 యూట్యూబ్ ఛానళ్లను తొలగించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఛానళ్లలో అత్యధికంగా చైనా (సుమారు 7,700 ఛాన్లు), రష్యా (2,000 పైగా ఛాన్లు) దేశాలకు చెందినవేనని వెల్లడించింది. ఈ ఛానళ్ల ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగా ప్రచారాలు చేయడం, అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను పొగుడుతూ వీడియోలు అప్‌లోడ్ చేయడం జరిగింది. రష్యా యూట్యూబ్ ఛాన్ల విషయానికొస్తే… నాటో, ఉక్రెయిన్‌లపై విమర్శలు చేస్తూ, రష్యాకు మద్దతుగా కంటెంట్‌ ప్రచారం చేస్తున్నట్లు గూగుల్ గుర్తించింది. అంతేకాదు, రష్యాలోని కొన్ని సంస్థలు కూడా ఈ ఛాన్లతో సంబంధం కలిగి ఉన్నట్లు స్పష్టం చేసింది.

ఇక చైనా, రష్యాతో పాటు ఇజ్రాయెల్‌, తుర్కియే, ఇరాన్‌, ఘానా, అజర్‌బైజాన్‌, రొమేనియా దేశాలకు చెందిన కొన్ని యూట్యూబ్ ఛాన్లను కూడా గూగుల్ తొలగించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, సామాజిక భద్రతకు విఘాతం కలిగించేలా నిరాధార వార్తలు, అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఇది గూగుల్ తీసుకున్న కీలకమైన నిర్ణయంగా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

Read More : ఐదు వారాల తరువాత గాల్లోకి లేచిన F-35

One thought on “గూగుల్ : అసత్య ప్రచారాలపై 11 వేల యూట్యూబ్ ఛానళ్ల తొలగింపు

Comments are closed.