బంగారం ధర సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 98,000 దాటింది. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో ఒక్క రోజులోనే రూ. 1,650 పెరిగి 10 గ్రాముల బంగారం ధర రూ. 98,100కు చేరుకుంది. అలాగే, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 97,700కు చేరుకుంది.
వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ. 1,900 పెరిగి రూ. 99,400ను తాకింది. మంగళవారం కిలో వెండి ధర రూ. 97,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3,318 డాలర్లకు చేరుకున్నట్లు సమాచారం. గోల్డ్ మన్ శాక్స్ అంచనా ప్రకారం, ఈ ఏడాది చివరికి బంగారం ధరలు రూ. 1.25 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వాణిజ్య యుద్ధం, ట్రంప్ సుంకాల ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read More : వక్ఫ్ బిల్లుపై మమత సంచలన ఆరోపణలు: చంద్రబాబు, నితీశ్ మద్దతు..
