చైనాలో వినూత్నమైనగా గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. శాంఘైలోని ఒక మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక యంత్రం ద్వారా బంగారాన్ని తక్కువ సమయంలో నగదు రూపంలో మార్పిడి చేసుకోవచ్చు.
ఈ గోల్డ్ ఏటీఎంలో మూడు గ్రాములకుపైగా, కనీసం 50% శుద్ధత కలిగిన బంగారు ఆభరణాలను డిపాజిట్ చేస్తే, ఆ బంగారాన్ని యంత్రం తక్షణమే కరిగించి దాని విలువను వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో 30 నిమిషాల్లో జమ చేస్తుంది.
అయితే ఈ సదుపాయం వినియోగించాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చైనాలో ఈ సరికొత్త సాంకేతికత ప్రస్తుతం ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.
Read More : ఫోన్‌పే మరియు గూగుల్ పే భారతదేశంలో 80% యూపీఐ మార్కెట్‌పై ఆధిపత్యం

One thought on “చైనా శాంఘైలో గోల్డ్ ఏటీఎం..”
Comments are closed.