గంగా నది నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరువ.?

గంగా నది నీటి మట్టం వేగంగా పెరుగుతుండగా, 70.26 మీటర్ల హెచ్చరిక స్థాయికి దగ్గరగా చేరుకుంది. దీనివల్ల తక్కువ స్థాయి ప్రాంతాల్లో భారీగా వరద ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా వరుణా నది పరివాహక ప్రాంతాలు అత్యధిక ప్రమాదానికి లోనవుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య భయంతో కొంతమంది కుటుంబాలు ఇప్పటికే అక్కడి నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఇప్పటివరకు 140 కి పైగా కుటుంబాలకు చెందిన 800 మందికి పైగా ప్రజలు సహాయ శిబిరాలకు లేదా ఇతర సురక్షిత ప్రదేశాలకు వెళ్లారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, వరద ప్రభావితులకు తగిన సహాయం అందించే చర్యలు చేపడుతోంది. సహాయక బృందాలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

స్థానికులెవ్వరూ అలసత్వం వహించకుండా అధికారుల సూచనలను పాటించాలని కోరుతున్నారు. ప్రస్తుతం గంగా పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Read More : 9 క్యారెట్ల బంగారానికి హాల్‌మార్క్ ఆమోదం

One thought on “గంగా నది నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరువ.?

Comments are closed.