గంగా నదిలో తేలుతున్న రాయితో కలకలం –Viral Video

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘాజీపూర్ జిల్లాలో గంగా నదిలో తేలుతున్న ఓ రాయి కలకలం రేపుతోంది. ప్రభుత్వ విభాగాలు తెలిపిన వివరాల ప్రకారం, స్థానికులు గమనించిన ఈ రాయిని తాడుతో కట్టి నదీ ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం పూజలు నిర్వహించి విశేషంగా ఆరాధిస్తున్నారు.

సుమారు 3 క్వింటాల బరువుతో ఉన్న ఈ రాయి నీటిలో మునగకుండా తేలిపోతుండడం స్థానికుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది రామాయణకాలంలో రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లతో సారూప్యత కలిగి ఉందని పలువురు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ రాయి విశ్లేషణ కోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More : బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు ‘కింగ్’ సినిమా షూటింగ్‌లో గాయం