హైదరాబాద్‌లో గద్దర్ తెలంగాణ అవార్డుల అంగరంగ వైభవం

హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్‌లో ప్రతిష్టాత్మక గద్దర్ తెలంగాణ అవార్డుల ప్రదానోత్సవం మరికొన్ని గంటల్లో అంగరంగ వైభవంగా ప్రారంభంకానుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి ఈ అవార్డు వేడుక జరగబోతుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ హీరోలు, హీరోయిన్లు సహా వివిధ రంగాల ప్రముఖులు భారీగా హాజరవుతున్నారు. విజేతలకు భారీ మొత్తంలో నగదు బహుమతులు అందించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో నంది అవార్డులుగా రాష్ట్ర ప్రభుత్వం సినిమా పురస్కారాలు అందజేసేది. కానీ, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దాదాపు దశాబ్ద కాలంగా ఎలాంటి సినిమా అవార్డు వేడుకలు జరగలేదు.

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో గద్దర్ పేరిట సినిమా అవార్డులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తూ గద్దర్ తెలంగాణ అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.

ఈ అవార్డుల ఎంపిక కోసం సహజ నటి జయసుధ నేతృత్వంలో జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసింది. 2014 నుంచి 2023 వరకు విడుదలైన ఉత్తమ చిత్రాలను మూడు కేటగిరీల్లో ఎంపిక చేశారు. జ్యూరీ కమిటీకి ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ చైర్మన్‌గా వ్యవహరించారు.

ఈ వేడుక ద్వారా తెలంగాణ సినీ రంగానికి కొత్త ఊపునిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.

Read More : గద్దర్ అవార్డ్స్‌కు ఘనంగా ఏర్పాట్లు

2 thoughts on “హైదరాబాద్‌లో గద్దర్ తెలంగాణ అవార్డుల అంగరంగ వైభవం

Comments are closed.