జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లి గ్రామంలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన జరిగింది. కుటుంబ కలహాలు హద్దులు దాటి తండ్రే తన కొడుకును హత్య చేశాడు.
స్థానికుల కథనం ప్రకారం, కాసం ఓదెలు (35) తన భార్య, రెండేళ్ల కుమారుడు, తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి ఒకే ఇంట్లో నివసించేవాడు. అయితే, ఓదెలు తండ్రి మొండయ్య గత కొంతకాలంగా తన కోడలితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీనికి విరుద్ధంగా ఓదెలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. పంచాయితీలు జరిగినా మొండయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు.
సోమవారం ఓదెలు పెళ్లిరోజు సందర్భంగా కుటుంబం సంతోషంగా వేడుకలు జరుపుకుంటుండగా, తండ్రీకొడుకుల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఆ క్షణంలోనే ఎన్నో రోజులుగా కక్ష పెంచుకున్న మొండయ్య తన కుమారుడిపై దాడికి పాల్పడ్డాడు. ఇంటి ముందు నిద్రిస్తున్న ఓదెలు తలపై రోకలిబండతో గట్టిగా కొట్టాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ఓదెలు మరణించాడు.
ఈ ఘటనపై ఓదెలు తల్లి సారక్క ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
Read More : తెలంగాణలో వడదెబ్బ విరుచుకుపడింది — ఒకేరోజు 9 మంది మృతి!

One thought on “కొడుకుని హత్య చేసిన తండ్రి”
Comments are closed.