ఎక్స్పీరియమ్ లో ప్రపంచ సుందరుల సందడి.

ఆదివారం హైదరాబాద్ లోని ఎక్స్పీరియమ్ ఎకో పార్కులో ప్రపంచ సుందరాంగులు తమ అందచందాలతో సందడి చేశారు.Tomaterra .. ప్రోగ్రాం ఏర్పాటు చేసి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను ఆహ్వానించారు ఎక్స్పీరియమ్ నిర్వాహకులు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అందచందాలతో పచ్చని ఎకో పార్క్ పరిసరాలకు మరింత అందాన్ని తెచ్చారు. టొమటెర్రా కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొని డీజే స్టెప్పులతో అదరగొడుతూ టమాటలను క్రష్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఎక్స్పీరియమ్ ఎకో పార్కులో ప్రకృతి అందాలను ఆస్వాదించి ఆశ్చర్య వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ దేశాల నుండి వచ్చిన అందాల భామలకు తెలంగాణ బ్రాండ్ అయినా నీరా, తాటి ముంజలు అందించారు. నీరా, తాటి ముంజలను వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఎంతగానో ఆస్వాదించి అద్భుతంగా ఉన్నాయి అంటూ కొనియాడారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తమ ఎకో పార్కులో ఏర్పాటు చేసిన టమోటరిన్ కార్యక్రమంలో పాల్గొని తమ ఎక్స్పీరియమ్ పార్కు కు మరింత శోభను, ప్రపంచవ్యాప్తంగా ప్రచారాన్ని కల్పించారని ఎండి రాందేవ్ తెలిపారు.

Read More : పీవీ నరసింహారావు విగ్రహం ఢిల్లీలో ఏర్పాటు:

One thought on “ఎక్స్పీరియమ్ లో ప్రపంచ సుందరుల సందడి.

Comments are closed.