EPFO లో కొత్త పెన్షన్ లెక్కింపు విధానం – పెన్షన్లు తగ్గనున్నాయి

EPFO: కొత్త లెక్కింపు విధానంతో పెన్షన్లలో భారీ కోత

ఈపీఎఫ్వో (EPFO) తాజా నిర్ణయంతో పెన్షన్ లెక్కింపు విధానంపై స్పష్టత ఇచ్చింది. కొత్త లెక్కల ప్రకారం, పెన్షన్లలో భారీగా కోత పడే అవకాశం ఉంది. అధిక పింఛను అర్హతలేని ఈపీఎఫ్ వో పెన్షనర్లకు వర్తించనున్న లెక్కింపు విధానాన్ని, ఇప్పుడు అధిక పింఛను అర్హులకు అమలు చేయనున్నట్లు EPFO వెల్లడించింది.

ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పరా-12లోని నిబంధనల ప్రకారం, 2014 సెప్టెంబరుకు ముందు సర్వీసుకు “పార్ట్-1″గా లెక్కించి, 2014 సెప్టెంబరు నుండి పదవీ విరమణ వరకు “పార్ట్-2″గా లెక్కించి తుది పెన్షన్ ఖరారు చేయనున్నట్లు EPFO తెలిపింది. ఈ విధానానికి కార్మికశాఖ ఆమోదం తెలిపిందని EPFO వివరించింది.

కొత్త విధానం ప్రకారం, పెన్షన్లలో 30 శాతం వరకు కోత పడే అవకాశముంది. పెన్షన్ లెక్కింపు విధానంలో 2014 సెప్టెంబరు 1 నాటికి ఉన్న నిబంధనలకు కాస్త మార్పులు చేర్పులు చేయడం జరిగింది. పెన్షన్ లెక్కింపు విధానంలో PART-1, PART-2గా వేరుచేసి, పెన్షన్ మొత్తాన్ని ఖరారు చేయడం మొదలు పెట్టింది.

ఈ మార్పులను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వారు 2014 సెప్టెంబరుకు ముందు ఉన్న నిబంధనను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. EPFO ఈ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత, పెన్షనర్లు తమ పింఛనును తగ్గించిన స్థాయిలో పొందుతారు.