వీపు వెనక పేరుకునే కొవ్వును కరిగించడానికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయడం అవసరం. భుజాల వెనక, నడుముకు ఎగువన పేరుకున్న ఈ కొవ్వు శరీరాన్ని పైభాగంలో లావుగా, ఎబ్బెట్టుగా చేస్తుంది. ఈ ఇబ్బందిని తొలగించాలంటే ఈ వ్యాయామాలు చేయాలి.
స్క్వాట్ జంప్స్: ఈ వ్యాయామం చేతులు, కాళ్లు మరియు మొత్తం శరీరానికి వ్యాయామం ఇస్తుంది. ఎలా చేయాలో చూద్దాం:
- నిటారుగా నిలబడి, మోకాళ్లను వంచి, కిందకు కుంగాలి.
- ఈ భంగిమలో గోడ కుర్చీ వేసినట్టు శరీరాన్ని వంచాలి.
- అప్పుడు ఒక్కసారిగా నిటారుగా నిలబడి, గాల్లోకి ఎగరాలి.
- ఎగిరేటప్పుడు శరీరం నిటారుగా ఉండి, చేతులు శరీరానికి సమాంతరంగా ఉండాలి.
- ఎగిరి నేలను తాకేటప్పుడు, తిరిగి మోకాళ్లను వంచి, గోడ కుర్చీ భంగిమలోకి రావాలి.
ఇలా 20 సార్లు 3 సెట్లు చేయాలి.
రివర్స్ లంజ్: ఈ వ్యాయామం కాళ్లు, తొడలతో పాటు వెన్ను దగ్గర పేరుకున్న కొవ్వును కరుగుతుంది. ఎలా చేయాలో చూద్దాం:
- నిటారుగా నిలబడి, నడుము మీద చేతులు ఉంచుకోవాలి.
- ఎడమ మోకాలు వంచి, కుడి కాలును రెండు అడుగుల ముందుకు పెట్టాలి.
- ఈ సమయంలో ఎడమ మోకాలు నేలను తాకాలి.
- తిరిగి కుడి కాలును వెనకకు తీసుకువెళ్లి, ఎడమ కాలును ముందుకు వేయాలి.
- ఇలాగే కుడి మోకాలు నేలను తాకాలని, కాళ్లు మార్చి రివర్స్ లంజ్ చేయాలి.
ఇలా 15 రెప్స్ 3 సెట్లు చేయాలి.
రేర్ డెల్డాయిడ్ రొటేషన్స్: ఈ వ్యాయామం రెండున్నర కిలోల బరువులతో చేయడం. ఎలా చేయాలో చూద్దాం:
- నిటారుగా నిలబడి, చేతుల్లో బరువులు తీసుకోవాలి.
- రెండు చేతులను పక్కకు చాపి, తిరిగి ఛాతీ దగ్గరకు తీసుకుని డంబెల్స్‌ను ఆనించాలి.
- తిరిగి చేతులు పక్కకు చాపాలి.
- చేతులు చాపేటప్పుడు ఊపిరి పీలుస్తూ, ఛాతీ దగ్గరకు తీసుకొచ్చేటప్పుడు ఊపిరి వదలాలి.
ఇలా 15 రెప్స్ 3 సెట్లు చేయాలి.
