ఈ-ఫార్ములా కేసులో చామల కౌంటర్

ఈ-ఫార్ములా కేసును పురస్కరించుకుని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ట్వీట్‌కు ఏఐసీసీ నేత, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామా ఎన్ని ఎపిసోడ్స్ అయినా నడుస్తూనే ఉంది. కేబినెట్ ఆమోదం లేకుండా, ఆర్బీఐ అనుమతి పొందకుండా రూ.44 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయడం పూర్తిగా తప్పు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రతిపక్షాలు ఎప్పుడైనా ట్వీట్లు పెట్టి ప్రజల్లో విషబీజాలు నాటాయా? ఇప్పుడు మాత్రం తమపై వచ్చిన ఆరోపణలపై సెంటిమెంట్ నాటకాలు మొదలుపెట్టారు” అని విమర్శించారు.

అలాగే, “నిన్నటి వరకు ‘దెయ్యాలు’ అన్న కవిత గురించి మాట్లాడిన వారు ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ ప్రయోగం మొదలుపెట్టారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నోటీసులు ఎలా ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు. చట్టపరమైన విచారణ ప్రక్రియను కూడా రాజకీయ రంగు ఇవ్వాలని చూస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read More : దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో గ్రాండ్ ఎయిర్ షో