గ్లామర్ గేర్‌లో టెన్నిస్ షాట్: దేవియాని స్పెషల్ గ్లిమ్స్

Deviyani Sharma viral photos

తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యాంకర్, నటి దేవియాని శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ఫామ్ లో ఉంది. “సేవ్ ది టైగర్స్” వెబ్‌సిరీస్‌లో శ్రీమతి పాత్రలో నటించి పాపులారిటీని సంపాదించుకుంది. మొదటి సీజన్‌లో నటనతో ఆకట్టుకున్న ఆమె, తర్వాత అందంతో అలరించి ఫాలోయింగ్ పెంచుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ దేవియాని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా స్కిన్ షో ఫోటోలు నెటిజన్స్ దృష్టిని పూర్తిగా ఆకర్షిస్తున్నాయి. వెబ్‌సిరీస్‌లో పద్దతిగా కనిపించిన దేవియాని, సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్‌తో సత్తా చూపిస్తోంది.

తాజాగా దేవియాని షేర్ చేసిన ఫోటోల్లో ఆమె టెన్నిస్ రాకెట్ పట్టి, స్టైలిష్ స్కర్ట్‌లో పోజులిచ్చింది. ఈ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. నడుము అందాన్ని హైలైట్ చేస్తూ ఇచ్చిన ఫోజులతో స్టార్‌ హీరోయిన్‌ మెటీరియల్‌ అనిపించుకుంటుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

అంతటి గ్లామర్ ఉన్నా ఇప్పటివరకు పెద్దగా ఆఫర్లు రాకపోవడం ఆశ్చర్యకరమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి హీరోయిన్ల కంటే దేవియాని మరింత గ్లామరస్‌గా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేవియాని టాలెంట్‌ను పరిశ్రమ కూడా గుర్తించి త్వరలోనే మంచి అవకాశాలు అందిస్తుందని అభిమానుల నమ్మకం.

Read More


One thought on “గ్లామర్ గేర్‌లో టెన్నిస్ షాట్: దేవియాని స్పెషల్ గ్లిమ్స్

Comments are closed.