వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ అరెస్టు

‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీ వివాదంపై ఈ చర్య జరిగింది. హైదరాబాద్‌లో ఆయనను పట్టుకుని, విచారణ కోసం విజయవాడకు తరలించినట్టు పటమట పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే… దాసరి కిరణ్ బంధువు గాజుల మహేశ్ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం మహేశ్ వద్ద కిరణ్ రూ.4.5 కోట్లు అప్పుగా తీసుకున్నారని సమాచారం. అయితే గడువు పూర్తయ్యినా అప్పు తిరిగి చెల్లించకపోవడంతో, బాధితుడు పలుమార్లు డబ్బు ఇవ్వాలని కోరారు.

ఈ క్రమంలో ఈ నెల 18న మహేశ్, తన భార్యతో కలిసి విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి వెళ్లి డబ్బు అడిగారు. అక్కడ దాదాపు 15 మంది తమపై దాడి చేశారని మహేశ్ ఆరోపించారు. ఈ దాడికి కిరణ్ ప్రోత్సాహం ఇచ్చారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అనంతరం హైదరాబాద్‌లో ఉన్న కిరణ్‌ను అరెస్టు చేసి, విచారణ నిమిత్తం విజయవాడకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Read More : వార్ 2 బాక్సాఫీస్‌లో నిరాశపరిచిన హృతిక్-ఎన్టీఆర్ ?

One thought on “వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ అరెస్టు

Comments are closed.