దసరా, దీపావళి పండుగల రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల నడకను పొడిగించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 24 వరకు కొన్ని రైళ్లు అదనంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
వివరాలు ఇలా ఉన్నాయి: తిరుపతి–సాయినగర్ షిరిడీ (07637/07638), నరసాపురం–తిరువణ్ణామలై (07219/07220), హైదరాబాద్–కన్యాకుమారి (07230/07229), కాచిగూడ–మధురై (07191/07192), హైదరాబాద్–కొల్లాం (07193/07194) ప్రత్యేక రైళ్లు నవంబర్ చివరి వరకు కొనసాగుతాయి.
ఈ రైళ్లు రేణిగుంట, తిరుపతి మీదుగా నడుస్తాయని అధికారులు వెల్లడించారు. పండుగల సమయంలో రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే తెలిపింది.
Read More : నారాయణ కీలక వ్యాఖ్యలు: అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తాం
2 thoughts on “దసరా, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు పొడిగింపు.”
Comments are closed.