మళ్లీ ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసుల పెరుగుదల.

ఆసియ ఖండంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. దక్షిణాసియా దేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా సింగపూర్, చైనా, థాయిలాండ్ దేశాల్లో కరోనా మరోసారి విజృంభిస్తున్నట్లుగా అధికారులు హెచ్చరిస్తున్నారు.

చైనాలో కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతుండగా, అక్కడి ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టింది. పలు ప్రాంతాల్లో ర్యాపిడ్ టెస్టింగ్, ఐసొలేషన్ చర్యలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

సింగపూర్‌లోనూ కొత్త వేరియంట్లు విజృంభిస్తున్నాయన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో అక్కడి ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. థాయిలాండ్‌లోనూ ప్రజలు మళ్లీ మాస్కులు ధరించడం మొదలుపెట్టారు.

ఇక భారత్‌లో కూడా స్వల్పంగా కరోనా కేసులు పెరుగుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా ప్రాథమిక సూచనలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖలు మళ్లీ అప్రమత్తమవుతుండగా, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More : యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్య ఆరోపణలపై సంచలనం.

One thought on “మళ్లీ ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసుల పెరుగుదల.

Comments are closed.