సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బెండాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఇళ్లను ప్రారంభించారు. బచ్చలి రమణమ్మ అనే లబ్ధిదారురాలితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గృహప్రవేశం చేసి, లబ్దిదారులను అభినందించారు.

ప్రభుత్వ హామీల అమలు:
గృహప్రవేశం అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగానే ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, వారి సొంతింటి కల నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Read More : కేసీఆర్ నిర్ణయం సమర్థించిన మల్లారెడ్డి.

One thought on “సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.

Comments are closed.