ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు సీఎం చంద్రబాబును కలవగా కీలక చర్చ

teachers problems

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు బుధవారం ఉండవల్లిలోని నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలు, విద్యా విధానంలో చేపట్టాల్సిన మార్పులు, ప్రభుత్వ పాలసీల గురించి ముఖ్యమంత్రితో చర్చించారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తానని గాదె శ్రీనివాసులు హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ

ఈ భేటీలో ఉపాధ్యాయుల పలు సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పాలసీలు రూపొందిస్తున్నామని, ప్రభుత్వానికి ఉపాధ్యాయుల అభ్యున్నతి ఎంతో ముఖ్యమని సీఎం తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘాలు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు ఆశీర్వాదం నాకు ధైర్యం: గాదె శ్రీనివాసులు

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం తాను కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సహకారంతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి తాను మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆశీర్వాదం తనకు కొండంత ధైర్యం ఇచ్చిందని, ఉపాధ్యాయులు – ప్రభుత్వం మధ్య వారధిగా పనిచేస్తానని వెల్లడించారు.

Read More

One thought on “ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు సీఎం చంద్రబాబును కలవగా కీలక చర్చ

Comments are closed.