AAA మూవీలో జాన్వీ, ప్రియాంక చోప్రాలేనా హీరోయిన్స్?

AAA Movie Heroine List

అల్లు అర్జున్‌ – అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌ ‘AAA’పై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, సోషల్‌ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌ #AAA ట్రెండ్‌ అవుతోంది. బన్నీ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, సినిమాకు సంబంధించి పలు రకాల గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్‌ ఉండబోతున్నారని, ఇప్పటికే ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయంటూ చర్చ నడుస్తోంది.

ఈ ప్రాజెక్టులో జాన్వీ కపూర్‌ పేరు మొదటిగా తెరపైకి వచ్చింది. రామ్‌ చరణ్‌ – బుచ్చిబాబు సినిమాతో ఆమె ఇప్పటికే టాలీవుడ్‌కి పరిచయం కానుండటంతో, ‘AAA’లో అల్లు అర్జున్‌కు జోడీగా ఆమెను అట్లీ ఎంపిక చేసినట్లు టాక్‌. జాన్వీ – బన్నీ ఫోటోలు మర్జ్‌ చేసి ఫ్యాన్స్‌ తయారుచేసిన పోస్టర్లు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌, గ్లోబల్‌ ఐకాన్‌ ప్రియాంకా చోప్రా కూడా ఈ సినిమాలో నటించబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అట్లీ స్వయంగా ఆమెను సంప్రదించినట్టు సమాచారం.

అయితే, ప్రియాంకా హాలీవుడ్‌ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, ‘AAA’ షూటింగ్‌కు అవసరమైన డేట్స్‌ ఆమె నుంచి పొందగలరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి – మహేష్‌బాబు సినిమాలో భాగంగా ఒక షెడ్యూల్‌ పూర్తిచేసిన ప్రియాంకా, టాలీవుడ్‌పై ఆసక్తి చూపుతున్నా, ‘AAA’లో ఆమె పాత్ర మెయిన్‌ రోలా? లేక గెస్ట్‌ అప్పియరెన్స్‌ వరకే పరిమితమా? అనేది ఇంకా స్పష్టత అవసరం. మొత్తానికి, జాన్వీ కపూర్‌, ప్రియాంక చోప్రాలే ఐదుగురు హీరోయిన్స్‌లో ఇద్దరా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వరకూ వేచి చూడాల్సిందే.

Read More

One thought on “AAA మూవీలో జాన్వీ, ప్రియాంక చోప్రాలేనా హీరోయిన్స్?

Comments are closed.