చైనా స్పందన: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా

భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేసిన “భారతదేశం-చైనా మధ్య నిజమైన ఘర్షణ చరిత్ర లేదు” అనే వ్యాఖ్యలపై చైనా స్పందించింది. భారత్-చైనా (India-China) సంబంధాలపై చైనా తన అధికారిక ప్రకటనలో స్పందిస్తూ, గత 2000 సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలే కొనసాగుతున్నాయని తెలిపింది.

“2000 ఏళ్ళకు పైగా ఉన్న భారత్-చైనా పరస్పర సంబంధాల్లో స్నేహపూర్వకమైన అనుబంధం ప్రాధాన్యతను పొందింది,” అని చైనా అధికార ప్రతినిధి తెలిపారు.

ఈ సందర్భంగా చైనా మరో ఆసక్తికర వ్యాఖ్య చేసింది. “డ్రాగన్ (Dragon) మరియు ఎలిఫెంట్ (Elephant) ల మధ్య పోరాటం కాకుండా, ఆహ్లాదకరమైన బృందనృత్యం (Ballet Dance) కొనసాగించడమే రెండు దేశాలకూ శ్రేయస్కరం,” అని చైనా సూచించింది.

“డ్రాగన్-ఎలిఫెంట్ పోరాటం” (Dragon-Elephant Fight) అనే పదాన్ని సాధారణంగా భారత్-చైనా మధ్య ఉన్న జియోపాలిటికల్ (Geopolitical) మరియు ఆర్థిక పోటీతత్వాన్ని వివరిసేందుకు ఉపయోగిస్తారు. అయితే, చైనా తన తాజా ప్రకటనలో ఆ పదాన్ని ప్రస్తావిస్తూ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలనే ఉద్దేశంతో తమ ప్రకటనను వెలువరించినట్లు తెలిపింది.

ఈ ప్రకటన నేపథ్యంలో భారత్-చైనా సంబంధాల్లో మరింత మైత్రి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Mode