మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ బూత్ బంగ్లా అనే లొకేషన్‌లో జరుగుతుండగా, ఈ షెడ్యూల్ చిత్రానికి కీలకంగా మారనుంది.
ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుండగా, రామ్ చరణ్ ఇందులో శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను పూర్తి చేసిన చిత్రబృందం, ప్రస్తుతం క్రూషియల్ ఎపిసోడ్స్‌ను షూట్ చేస్తోంది.
ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2025లో గ్రాండ్‌గా విడుదల కానుంది. రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్‌పై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో ఇద్దరూ మరో బ్లాక్‌బస్టర్ హిట్ నమోదు చేస్తారా? అనేది ఆసక్తిగా మారింది.

One thought on “బూత్ బంగ్లాలో రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమా షూటింగ్!”
Comments are closed.