జూన్ 2025 నుంచి 5జీకి మారనున్న బీఎస్‌ఎన్‌ఎల్

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 2025 జూన్ నుంచి 4జీ నుండి 5జీకి మారే ప్రక్రియను ప్రారంభించనుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, 5జీ సేవలు త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే 4జీ సేవలను మెరుగుపరిచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, తదుపరి దశలో 5జీ కోసం అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ అప్గ్రేడ్‌తో టెలికాం రంగంలో పోటీ మరింత పెరిగే అవకాశముందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Read More : చైనా ఫుడాన్ యూనివర్సిటీ విప్లవాత్మక వైద్య ప్రయోగం – గాయపడ్డ నరాలను దాటించేందుకు బ్రెయిన్-స్పైనల్ కార్డ్ ఇంటర్‌ఫేస్ అభివృద్ధి