బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘జాట్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కింది. తాజాగా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో సన్నీ బాలీవుడ్ నిర్మాతల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సౌత్ నిర్మాతలు సినిమాలను ఎంతో ప్రేమ, పట్టుదలతో నిర్మిస్తారని, దర్శకులపై పూర్తిగా విశ్వాసం ఉంచుతారని సన్నీ అభిప్రాయపడ్డాడు. “హిందీ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఆ నమ్మకం కొరవడింది. కానీ సౌత్‌లో ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయితే, నిర్మాతలు పూర్తి స్థాయిలో సినిమా వెనుక ఉంటారు,” అని చెప్పాడు.
ఉండొచ్చని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, ‘జాట్’ సినిమాలో సన్నీ డియోల్‌తో పాటు జగపతిబాబు, రణదీప్ హూడా, రెజీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే, కొందరు ఈ వ్యాఖ్యలను సన్నీ అసంతృప్తిగా భావిస్తున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికీ పాత విధానాలు కొనసాగుతుండటంతో పాటు, ఆయన నటించిన ‘లాహోర్ 1947’ ఆలస్యం కావడం కూడా దీనికి కారణమై ఉండొచ్చని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, ‘జాట్’ సినిమాలో సన్నీ డియోల్‌తో పాటు జగపతిబాబు, రణదీప్ హూడా, రెజీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

One thought on “బాలీవుడ్ నిర్మాతలు సౌత్ నుంచి నేర్చుకోవాలి: సన్నీ డియోల్”
Comments are closed.