భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ప్రయోగించిన శక్తిమంతమైన “ఫతా-2” క్షిపణిని భారత సైన్యం శనివారం తెల్లవారుజామున హర్యానాలోని సిర్సా వద్ద విజయవంతంగా అడ్డుకుంది. ఇదే సమయంలో, జమ్మూలోని వైమానిక దళ స్థావరంపై పాకిస్థాన్ చేసిన మరో దాడి యత్నాన్ని భారత సైన్యం సమర్థవంతంగా ధ్వంసం చేసింది.
ఈ ఘటన పాకిస్థాన్ సైన్యం, గురువారం నుంచి భారత నగరాలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న అకారణ దాడుల మధ్య చోటు చేసుకుంది. రాజస్థాన్, గుజరాత్, జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులు, మరియు ఫిరంగి దాడులతో మంటలను వెలిగించింది. ఈ దాడులకు స్పందిస్తూ భారత ప్రభుత్వం పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది.
పాకిస్థాన్ ప్రయోగించిన “ఫతా-2” క్షిపణి 400 కిలోమీటర్ల పరిధి కలిగిన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి. ఇది మార్గనిర్దేశిత ఆర్టిలరీ రాకెట్ వ్యవస్థ కావడంతో కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణి సంప్రదాయ ఆయుధాలతో పాటు, అవసరమైనప్పుడు వ్యూహాత్మక అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. “ఫతా-2” క్షిపణి “ఫతా-1” యొక్క ఆధునిక వెర్షన్ కాగా, దీనికి అమెరికాకు చెందిన హెచ్ఐఎంఏఆర్ఎస్-జీఎంఎల్ఆర్ఎస్ మరియు చైనా పీహెచ్ఎల్ సిరీస్ గైడెడ్ రాకెట్ వ్యవస్థలతో పోలి ఉంటుంది. ఈ క్షిపణి అణు రహితంగా కూడా కచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యం కలిగి ఉండటం, యుద్ధరంగంలో వ్యూహాత్మక అణ్వాయుధాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read More : పాకిస్తాన్ చేసిన తప్పుడు ప్రచారాలపై భారత సైన్యం స్పష్టత..
