బాలకృష్ణకు అరుదైన గౌరవం.

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సినీ ప్రస్థానంలో అరుదైన మైలురాయిని అందుకున్నారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లండన్‌లోని ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయనకు స్థానం లభించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు బాలకృష్ణను కలిసి సర్టిఫికేట్‌ను అందజేశారు.

ఈ విశేష ఘనతపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపారు. “బాలనటుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి, జానపద, కుటుంబ, యాక్షన్ చిత్రాలతో అభిమానులను అలరించిన బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తిచేయడం గర్వకారణం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం ఎంతో అభినందనీయం” అని పవన్ పేర్కొన్నారు.

అలాగే ఆయన, “బాలకృష్ణ ఇలాగే మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కొనసాగుతున్నారు. ఈ గుర్తింపు పట్ల నందమూరి అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More : మెగాస్టార్ – సీఎం సహాయనిధికి కోటి విరాళం

One thought on “బాలకృష్ణకు అరుదైన గౌరవం.

Comments are closed.