వక్ఫ్ (సవరణ) బిల్లుపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సవాల్ చేశారు. పార్లమెంట్‌లో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన బిల్లుపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చ సందర్భంగా ఆయన బిల్లుపై అభిప్రాయాలు వెల్లడిస్తూ దాని కాపీని చింపేశారు.
ఈ బిల్లుపై స్పందించిన ఒవైసీ, “ఇది ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా మార్చే కుట్రబద్ధమైన ప్రయత్నం” అని తీవ్రస్థాయిలో విమర్శించారు. బిల్లును వెంటనే ఉపసంహరించాలన్న డిమాండ్‌తో పాటు, మైనారిటీ హక్కులకు భంగం కలిగించే చట్టాలపై మౌనంగా ఉండబోమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతుండగా, అసదుద్దీన్ ఒవైసీ లీగల్ గా వ్యతిరేకించేందుకు ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More : వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం – దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్

One thought on “వక్ఫ్ (సవరణ) బిల్లును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ..”
Comments are closed.