చెన్నైకు చెందిన ప్రముఖ సినీ నటుడు ఆర్య నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటితో పాటు, ఆయనకు సంబంధించిన రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థల్లో ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్య వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ తనిఖీలు ఉదయం నుంచే ప్రారంభమయ్యాయని, వాటిని కొద్ది గంటలపాటు కొనసాగించే అవకాశముందని సమాచారం.
పన్ను ఎగవేత ఆరోపణలపై పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
Read More : టాటూ తొలగింపు గాసిప్పై తెరలేపిన సమంత:

One thought on “సినీ నటుడు ఆర్య ఇంటిపై ఐటీ శాఖ సోదాలు”
Comments are closed.