ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ అభ్యర్థులకు కీలక ప్రకటన విడుదలైంది. జులై 1, 2 తేదీలలో నిర్వహించనున్న మెగా డీఎస్సీ పరీక్షల కోసం హాల్ టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. అభ్యర్థులు వెంటనే ఏపీ విద్యాశాఖ వెబ్‌సైట్ apdsc.apcfss.in ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇటీవల అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల కారణంగా జూన్ 20, 21 తేదీలలో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. వాయిదా వేసిన ఈ పరీక్షలను జులై 1, 2 తేదీల్లో తిరిగి నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తేదీలు, పరీక్ష కేంద్రాల్లో మార్పులు జరిగినందున, అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసి, వాటిలో ఉన్న వివరాలను పరిశీలించాలని సూచించారు. తాజా హాల్ టికెట్లలో పరీక్ష తేదీ మరియు కేంద్రాన్ని నిర్ధారించుకొని పరీక్షకు హాజరవ్వాలని అధికారులు సూచించారు.
Read More : టీడీపీ సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలు…
