ఏపీ సీఎం రైతు సమస్య వినతిని స్వీకరించారు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో ఓ ప్రత్యేక సంఘటన చోటు చేసుకుంది. స్థానిక నాయకులు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికిన తర్వాత సీఎం ప్రజాసంబోధన నిర్వహించారు.

కాన్వాయ్‌లో వెళ్లి తిరుగుతున్న సమయంలో గోల్లప్రోలు వాసి గంగాధర్ అనే రైతు తన భూమి ఆన్లైన్‌లో తక్కువ చూపబడుతున్నందుకు న్యాయం కోరుతూ ఫ్లెక్సీ పట్టుకొని చంద్రబాబు కాన్వాయ్‌ ముందు నిలబడ్డాడు. పోలీసులు ఆపినప్పటికీ సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ ని ఆపి రైతుతో నేరుగా మాట్లాడారు.

వివరాలను తెలుసుకున్న చంద్రబాబు సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్కడే గంగాధర్‌తో పాటు మరికొందరి వినతిపత్రాలను స్వీకరించగా, ఆయనకు సంబంధించిన సమస్యలకు త్వరిత పరిష్కారం కల్పిస్తారని తెలిపారు.

One thought on “ఏపీ సీఎం రైతు సమస్య వినతిని స్వీకరించారు

Comments are closed.