అనుపమా పరమేశ్వరన్, ధృవ్ విక్రమ్ డేటింగ్ చేస్తున్నారా?

Anupama Parameswaran Dhruv Vikram Love Rumors

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు, తమిళం సహా ఇతర భాషల్లో చిత్రాలు చేస్తూ గుర్తింపు పొందింది. తాజాగా ఈ నటి తమిళ యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్‌ను డేటింగ్ చేస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చియాన్ విక్రమ్ కుమారుడైన ధ్రువ్‌తో అనుపమ సన్నిహితంగా ముద్దుపెట్టుకుంటున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ ఫోటో నిజమా? లేక మోర్ఫింగ్ చేశారా? అన్న విషయమై స్పష్టత రాలేదు. ఇంతవరకూ ఈ వార్తలపై అనుపమ, ధ్రువ్ ఇద్దరూ స్పందించలేదు. అయినప్పటికీ ఈ గాసిప్ ఫిలింనగరంలో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ కలసి ‘బైసన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోషన్‌ కోసమే ఆ ఫోటో లీక్ చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇది పబ్లిసిటీ స్టంటే కావచ్చని కొందరు భావిస్తున్నారు.

ధ్రువ్ ప్రస్తుతం స్క్రిప్ట్ ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ అనే తెలుగు సినిమాను పూర్తిచేసింది. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

Read More


One thought on “అనుపమా పరమేశ్వరన్, ధృవ్ విక్రమ్ డేటింగ్ చేస్తున్నారా?

Comments are closed.