గత కొన్ని పరిశోధనలు అధికంగా కోపం కలిగించే వ్యక్తులు శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యంపై ఈ కోపానికి తీవ్రమైన ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ కోపం రావడం గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచుతుందంటూ తాజా అధ్యయనాలు వెల్లడించాయి.
కోపం రావడం ఒక సాధారణ మానవ భావోద్వేగం. కానీ అది నియంత్రణలో ఉండాలి. తరచూ కోపంగా ఉండే అలవాటు రక్తపోటు పెరగడం, హృదయ స్పందన వేగంగా మారడం, ధమనుల్లో వాపు ఏర్పడడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ ప్రభావాల వల్ల గుండెపోటు వంటి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఒక అధ్యయనంలో కోపం వచ్చిన రెండు గంటల సమయంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఐదు రెట్లు పెరిగిందని తేలింది. కోపం వల్ల అడ్రినలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా విడుదలై రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచుతాయి. దీని ప్రభావం వల్ల రక్తనాళాల్లో నలిగిపోయే అవకాశం ఏర్పడి, ధమనులు గట్టిపడి గుండెపోటుకు దారి తీస్తుంది.
మానసిక సమస్యలు, జీర్ణ సమస్యలు కూడా
కేవలం గుండెపోటు మాత్రమే కాదు, తరచూ కోపంగా ఉండటం వల్ల మానసికంగా కూడా అనేక సమస్యలు కలుగుతాయి. ఈ కోపం నిద్రలేమి, ఆందోళన, అలసట, ఏకాగ్రత లోపం, తేలికపాటి నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళాన్ని కలిగిస్తుంది. అంతేగాక, ఇది అల్సర్లు, అసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలకూ కారణమవుతుంది.
కోప నియంత్రణకు వీటిని పాటించండి
కోపాన్ని నియంత్రించడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. వాటిలో ప్రధానంగా లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం, యోగా, క్రమబద్ధమైన వ్యాయామం ముఖ్యమైనవి. ఇవి మన శరీరం మరియు మనసును సంతోషంగా ఉంచి కోపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
అయితే, ఈ మార్గాల ద్వారా ఫలితం కనపడకపోతే వెంటనే ఒక వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడే కోపానికి మూలంగా ఉండవచ్చని వారు తెలిపారు. అవసరమైతే మందులు, కౌన్సిలింగ్ ద్వారా చికిత్స కూడా అందుబాటులో ఉంది.
Read More : పండ్లు ఆరోగ్యానికి మంచివే… కానీ కొన్ని కలయికలు ప్రాణానికి హానికరం!

One thought on “వైద్య నిపుణుల హెచ్చరిక”
Comments are closed.