వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీసీసీఐ ఆధిపత్యం క్రికెట్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోందని, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)పై కూడా వారి ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన మండిపడ్డారు.
ఆండీ రాబర్ట్స్ మాట్లాడుతూ, ఇప్పుడు ఐసీసీ అంటే ‘ఇండియన్ క్రికెట్ కౌన్సిల్’ అన్నట్లుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. క్రికెట్‌లో అనేక విషయంలో భారత్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భారత్ మాత్రమే అన్ని అంశాల్లో దక్కించుకుంటోందని, ఇదే పరిస్థితి కొనసాగితే ఇతర దేశాలకు న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేగాక, 2024లో జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా కూడా భారత్‌కు అనవసరమైన ప్రయోజనం కల్పించారని రాబర్ట్స్ ఆరోపించారు. టోర్నమెంట్‌లో కీలక ఘట్టాల్లో భారత్‌కు అనుకూలంగా నిర్ణయాలు జరిగాయన్న అనుమానం కలుగుతుందన్నారు. ఈ పరిస్థితులు అంతర్జాతీయ క్రికెట్‌లో సమానత్వానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆండీ రాబర్ట్స్ తన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ తరహా వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారత క్రికెట్ బలంగా ఎదిగినప్పటికీ, ఇతర దేశాల పట్ల అనుచిత ప్రవర్తన జరుగుతుందనే ఆరోపణలు అప్పుడప్పుడూ వినిపిస్తున్నాయి.

One thought on “భారత క్రికెట్ ఆధిపత్యంపై ఆండీ రాబర్ట్స్ ఆగ్రహం..”
Comments are closed.