నటి అమీజాక్సన్ మళ్లీ తల్లైంది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబుకు ఆస్కార్ అలెగ్జాండర్ అనే పేరు పెట్టారు. ఈ వార్త బయటకు వచ్చేసరికి అమీజాక్సన్‌కు ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
గత ఏడాది, అమీజాక్సన్ తన రెండవ భర్త ఎడ్వర్డ్ వెస్ట్ విక్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత, వారు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ దంపతులు ఈ ఏడాది కొత్త జీవితం ప్రారంభించారు.

అమీజాక్సన్ సినీ కెరీర్ ప్రారంభంలోనే పెద్ద చిత్రాల్లో నటించింది. రామ్ చరణ్, విక్రమ్, శంకర్ లాంటి స్టార్స్‌తో పనిచేసిన ఆమె, రజనీకాంత్ హీరోగా నటించిన 2.0లో కూడా నటించింది. అయితే, ఈ సినిమాలు ఆమె కెరీర్‌కు బలమైన పునాదిగా నిలవలేకపోయాయి. తర్వాత, ఆమెకు అవకాశాలు తగ్గడంతో, గత ఏడాది రెండు సినిమాల్లో నటించింది.


One thought on “అమీజాక్సన్ మళ్లీ తల్లి అయ్యింది.. బాబుకు ఆస్కార్ అలెగ్జాండర్ పేరుతో నామకరణం!”
Comments are closed.