కుటుంబ వేడుకలో కొత్త లుక్‌తో అల్లు అర్జున్!

Allu Arjun new look Atlee film

పుష్ప 2 సూపర్‌ హిట్‌తో ఫుల్‌ బిజీగా ఉన్న ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ త్వరలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫోటోషూట్ కూడా పూర్తయింది. ఇటీవల అల్లు అర్జున్‌ ముంబయిలో లుక్ టెస్ట్ పూర్తిచేసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చాడు.

ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌ తాత్కాలికంగా AA22xA6గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇందులో అల్లు అర్జున్‌ సూపర్‌హీరోగా కనిపించనున్నాడు. ఇదే అతడు అట్లీతో చేస్తున్న మొదటి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే, అల్లు అర్జున్‌ ఇటీవల తన కుటుంబంతో కలసి బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. ఆయన బ్రౌన్ కుర్తా, బ్లాక్ ప్యాంట్‌లో డాషింగ్ లుక్‌లో కనిపించాడు. ఆయన భార్య స్నేహారెడ్డి ఎరుపు టోన్ చీరలో మెరిసిపోయింది. కుమార్తె అర్హ లైమ్ గ్రీన్ హాఫ్ సారీలో అందరినీ ఆకట్టుకుంది.

ఈ ఫ్యామిలీ ఫంక్షన్‌లో పాల్గొన్న స్టైలిష్ స్టార్‌ తన కొత్త హెయిర్ లుక్‌తో ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమా కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా కమిట్ అయిన అల్లు అర్జున్, ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేకాదు, పుష్ప 3కి కూడా సిద్ధమవుతున్నాడు.

Read More


One thought on “కుటుంబ వేడుకలో కొత్త లుక్‌తో అల్లు అర్జున్!

Comments are closed.