టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమా రంగంతో పాటు థియేటర్ బిజినెస్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్‌ను విజయవంతంగా నడుపుతున్న ఆయన.. తాజాగా విశాఖపట్నంలోనూ మరో మల్టీప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విశాఖ ఇనార్బిట్ మాల్లో ‘ఏషియన్ అల్లు అర్జున్ (AAA)’ మల్టీప్లెక్స్ నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 8 స్క్రీన్లు ఉండనున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పెద్ద ఇనార్బిట్ మాల్గా పేరు పొందిన ఈ ప్రాంగణంలో.. అల్లు అర్జున్ నిర్మించబోయే మల్టీప్లెక్స్ అత్యంత లగ్జరీ థియేటర్‌గా ఉండనుంది.
ఈ మల్టీప్లెక్స్‌లో అవసరమైన ఫర్నిచర్, ఎక్విప్మెంట్ విదేశాల నుంచే దిగుమతి చేస్తున్నారు. అన్ని పనులు వేగంగా కొనసాగుతున్నాయని సమాచారం. వచ్చే ఏడాది వేసవి కాలంలో ఈ థియేటర్‌ను ప్రారంభించాలని అల్లు అర్జున్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అభిమానులు, సినిమా ప్రేమికుల కోసం త్వరలోనే ఈ థియేటర్ గుమ్మం తెరచనుంది.
Read More : గబ్బర్ సింగ్‌తో నా కెరీర్ మలుపు తిరిగింది: శృతి హాసన్

One thought on “విశాఖలో అల్లు అర్జున్ లగ్జరీ మల్టీప్లెక్స్ ప్రారంభానికి శ్రీకారం”
Comments are closed.