తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌పై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణ జరపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి సంబంధించిన రూ.101 కోట్ల రుణ మోసం కేసులో ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో మూడు గంటలపాటు విచారణ జరిపి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే, రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థలు 2017 నుంచి 2019 మధ్యకాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ.101 కోట్ల రుణం తీసుకుని ఎగవేశాయి. ఈ నిధులను సంస్థ యజమానులు తమ స్వప్రయోజనాలకు వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సీబీఐ కేసు నమోదు చేసిన అనంతరం, మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టింది.
దర్యాప్తులో భాగంగా అల్లు అరవింద్‌కు చెందిన సంస్థలు, రామకృష్ణ గ్రూప్ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈడీ అధికారులు అరవింద్‌కు నోటీసులు జారీ చేసి, హాజరు కావాలని ఆదేశించారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లు వంటి అంశాలపై ప్రశ్నలు వేయడం జరిగింది. విచారణ ఇంకా కొనసాగుతోందని, అవసరమైతే మరోసారి హాజరుకావాలని అధికారులు సూచించినట్లు సమాచారం. రామకృష్ణ గ్రూప్ యజమానులు వి. రాఘవేంద్ర, వి. రవి కుమార్‌లతో అరవింద్‌కు ఉన్న సంబంధాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
Read More : జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

One thought on “టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్‌ను ఈడీ విచారణ”
Comments are closed.