అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కథ లీక్ – నెట్టింట వైరల్!

Ajith and Vijay

అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ వేసవిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అధిక్ రవిచంద్రన్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి కొత్త అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల లీకైన కథ ప్రకారం, ఓ డాన్ తన హింసాత్మక జీవితం వదిలి కుటుంబంతో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాడు. కానీ అతని గతం అతన్ని వదలక, పాత శత్రువులను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ కథని చూసిన నెటిజన్లు విజయ్ లియో సినిమాతో పోల్చుతున్నారు.

ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, అర్జున్ దాస్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ హైదరాబాద్, స్పెయిన్, యూకేలో జరగగా, 2024 డిసెంబర్‌లో షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

మరి ఈ చిత్రం నిజంగా లియోకు సమానమా? లేక కొత్తదనం చూపిస్తుందా? అనేది ప్రేక్షకుల తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది!

Read More

One thought on “అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కథ లీక్ – నెట్టింట వైరల్!

Comments are closed.