అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్న విశ్వాస్‌కుమార్ రమేశ్ గురించి మరో కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఆయన నడుచుకుంటూ రోడ్డుపైకి వస్తుండగా కనిపించారు. తెలుపు రంగు టీషర్ట్ ధరించి, చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకున్న విశ్వాస్ను చూడగానే అక్కడ ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. అనంతరం ఆయన శరీరంపై గాయాలు గమనించి వెంటనే సహాయం అందించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అత్యంత ప్రమాదకరమైన ఘటనలో నుంచి ఆయన ఈ విధంగా బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Read More : ఉద్యోగిపై యువతి రివాల్వర్‌తో బెదిరింపు

One thought on “విశ్వాస్‌కుమార్ రమేశ్ అద్భుత రక్షణ వీడియో వైరల్”
Comments are closed.