విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ మృతి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం (ఏఐ171) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే, ఇప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ విమానం మేఘాని ప్రాంతంలో కూలిన వెంటనే దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేసాయి. విమానంలో దూర ప్రయాణానికి కావలసినంత ఇంధనం నిండి ఉండటంతో, కుప్పకూలిన వెంటనే పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ మంటల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

విజయ్ రూపానీ తన భార్యను లండన్‌లో నుంచి భారత్‌కు తీసుకురావడం కోసం ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్టు చెక్-ఇన్ రికార్డుల ద్వారా వెల్లడైంది. ఆయన బిజినెస్ క్లాస్‌లో (సీటు నంబర్ 2డి) మధ్యాహ్నం 12:10 గంటలకు జోన్ 1 నుంచి బోర్డింగ్ పూర్తి చేసినట్టు సమాచారం. ఆయన టికెట్ బుకింగ్ రిఫరెన్స్ 6ఎఫ్‌కే2ఎం2 కాగా, ఇ-టికెట్ నంబర్ 0982865207073గా నమోదైంది. ఈ ఘోర ప్రమాద తీవ్రతను పరిశీలిస్తే, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడే అవకాశం చాలా తక్కువగా ఉందని విమానయాన నిపుణులు భావిస్తున్నారు.

ఈ విషాదకర ఘటనపై అధికారులు మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారని సమాచారం.

Read More : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం

One thought on “విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ మృతి

Comments are closed.