Robbery : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదంతో విమానాశ్రయంలో అన్ని కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశారు.

విమానం మేఘాని నగర్ సమీపంలోని ఇంటర్న్ డాక్టర్ల రెసిడెన్షియల్ హాస్టల్‌పై కూలిపోయింది. విమానం రెక్క భవనంలోని మూడో, నాల్గో, ఐదో అంతస్తులను బలంగా ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో యాభై మందికిపైగా ఉండే హాస్టల్ భవనం మొత్తాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ హాస్టల్లో యువ వైద్య ఇంటర్న్లు, వారి కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు.

ప్రమాద సమయంలో కొంతమంది లోపలే చిక్కుకుపోగా, కొంతమంది ప్రాణాలు కాపాడుకునేందుకు పై అంతస్తుల నుంచి కిందకు దూకేశారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, ‘‘ఓ తండ్రి తన పిల్లను ప్రాణాల కోసం నాలుగో అంతస్తు నుంచి కిందకి విసిరాడు’’ అని పేర్కొన్నారు. అదే అంతస్తు నుంచి దూకిన ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. చాలామంది కిటికీల నుంచి కిందకి దూకుతున్న దృశ్యాలు కలచివేసాయి.

అధికారికంగా మృతుల సంఖ్యను వెల్లడించనప్పటికీ, ఎనిమిది నుంచి తొమ్మిది మందికిపైగా మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఈ ప్రమాదానికి మరో విషాదకరమైన కోణం కూడా బయటపడింది. వలంటీర్ల ముసుగులో కొందరు దొంగలు హాస్టల్‌లోకి ప్రవేశించి సేఫ్‌లు, నగదు, బంగారం, మొబైల్ ఫోన్లు దోచుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More : విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ మృతి

One thought on “Robbery : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం

Comments are closed.