ఆదిత్య 369 రీ రిలీజ్: మోహినీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Aditya 369 Re-release Mohini

నందమూరి బాలకృష్ణ నటించిన కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్దమవుతోంది. 1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ టైమ్ ట్రావెల్ మూవీ, తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రత్యేక స్థానం సంపాదించింది. 34 ఏళ్ల తర్వాత 4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్ సిస్టమ్‌తో పునర్విడుదల అవుతున్న ఈ సినిమా, ప్రేక్షకులను మరోసారి మంత్ర ముగ్ధులను చేయనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ కృష్ణకుమార్, శ్రీకృష్ణదేవరాయల పాత్రల్లో అద్భుతంగా నటించగా, హీరోయిన్ మోహినీ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మోహినీ, అసలు పేరు మహాలక్ష్మి శ్రీనివాసన్, తమిళనాడులోని తంజావూరులో జన్మించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించిన మోహినీ, 1991లో “ఈరమన రోజావే” చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. “ఆదిత్య 369” సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మోహినీ, ఆ తర్వాత “డిటెక్టివ్ నార”, “మామ బాగున్నావ్”, “హిట్లర్” వంటి చిత్రాల్లో నటించింది. అందం, అభినయం పరంగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ, ఎక్కువ కాలం సినీ కెరీర్ కొనసాగించలేకపోయింది. 2011లో ఆమె చివరిసారిగా వెండితెరపై కనిపించింది.

సినిమా అవకాశాలు ఉన్న సమయంలోనే భరత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న మోహినీ, అమెరికాలో సెటిల్ అయ్యింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె, కొన్నేళ్లకు భర్తతో విడాకులు తీసుకుని, ప్రస్తుతం సింగిల్ మదర్‌గా జీవితాన్ని కొనసాగిస్తోంది. క్రైస్తవ మత బోధకురాలిగా వివిధ ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటోంది. గతంలో సన్నగా కనిపించిన మోహినీ ప్రస్తుతం కాస్త బొద్దుగా కనిపిస్తున్నప్పటికీ, ఆమె అందం ఏమాత్రం తగ్గలేదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Read More

One thought on “ఆదిత్య 369 రీ రిలీజ్: మోహినీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Comments are closed.