తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. కీలక పట్టణాల్లో కొత్త పోలీస్ అధికారులు నియామకం

IPS

తెలంగాణ రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పోలీసు విభాగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బదిలీ అయిన అధికారులను ఆయా జిల్లాల్లో కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు, జిల్లాల్లో కొత్త పోలీసు కమిషనర్లు, ఎస్పీల నియామకం చేపట్టారు.

ఇప్పుడిప్పుడే కీలక బాధ్యతలు చేపట్టిన కొత్త అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి:

  • నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా సాయి చైతన్య నియమితులయ్యారు.
  • ఆదిలాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా అఖిల్ మహాజన్ నియామకమయ్యారు.
  • కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా గౌస్ ఆలం బాధ్యతలు స్వీకరించనున్నారు.
  • కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్రను నియమించారు.
  • రామగుండం పోలీస్ కమిషనర్‌గా అంబర్ కిశోర్ ఝా నియమితులయ్యారు.
  • వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సన్రైత్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
  • సూర్యాపేట జిల్లా ఎస్పీగా నరసింహ నియామకమయ్యారు.
  • సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పంకజ్ పరితోష్ నియమితులయ్యారు.
  • ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా సింధూ శర్మ నియామకమయ్యారు.
  • నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేశ్ నియమితులయ్యారు.
  • పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్ నియమించబడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో పాలన మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు పోలీసులు విభాగంలో ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు తమ పరిధిలోని శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులు సూచించారు.

Read More